దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటన
'ప్రతి ఇంటి ముందు తులసి, వేప చెట్లుండాలి' - రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మహిళలంతా ఇంట్లో సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు.
!['ప్రతి ఇంటి ముందు తులసి, వేప చెట్లుండాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4932656-181-4932656-1572616109303.jpg)
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటన
ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు తులసి, వేప చెట్లు పెంచుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీలో తడి చెత్త, పొడి చెత్త బుట్టలు, జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. దుబ్బాకలో డంపింగ్ యార్డ్ కోసం మూడు కోట్లు కేటాయించామన్నారు. చెత్త సేకరణ కోసం, చెట్ల పెంపకానికి మూడు ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు, ఆటోలు ఇస్తున్నామని తెలిపారు.
- ఇదీ చూడండి : కాలుష్య ప్రభావంతో హస్తినలో ఆరోగ్య అత్యవసర స్థితి