ఆర్థిక మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా చౌదర్‌పల్లిలోని దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌదర్పల్లిలో భవన నిర్మాణ రంగ కార్మికుల భవనం, కుమ్మర సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు.
చౌదర్పల్లిలో మంత్రి హరీశ్‌రావు పర్యటన - finance minister harish rao
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్‌పల్లిలోని దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పర్యటన
అనంతరం ప్రాధమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలవుతుందా లేదా అని తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో ఆరా తీశారు.
- ఇదీ చూడండి : ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు... హాజరు కావాల్సిందే!
TAGGED:
finance minister harish rao