డిసెంబర్ 15న సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ప్రారంభం? - minister harish rao visit to siddipet
సిద్దిపేట జిల్లాలోని నాగులబండ పరిధిలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటన
సిద్దిపేట జిల్లాలోని నాగులబండలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి డిసెంబర్ 15న ప్రారంభమయ్యేలా సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ దిశగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ ఛైర్మన్ డా. జి.ఎన్. రావుతో కలిసి ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. చుట్టూ ప్రహరి నిర్మించి చెట్లు నాటాలని అధికారులకు సూచించారు.
- ఇదీ చూడండి : పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట...!