సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ బస్ డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విపక్ష నాయకులతో కలిసి కార్మికులు డప్పు చప్పుళ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు.
హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల మానవహారం - హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ కార్మికులు మానవహారం నిర్వహించారు.
హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల మానవహారం
ఇదీ చూడండి: బంపర్ ఆఫర్: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు