తెలంగాణ

telangana

By

Published : May 27, 2021, 2:06 PM IST

ETV Bharat / state

చెక్​డ్యాంలతో పొలాలు సస్యశ్యామలం :మంత్రి హరీశ్

కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

minister harish rao, minister harish rao in siddipet
మంత్రి హరీశ్ రావు, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని, మూడ్రోజుల్లో రూ.1.20 కోట్ల చెల్లింపులు జరిపినట్లు తెలిపారు.

నంగునూరు మండలం దర్లపల్లి గ్రామంలో ఆసర్ల యాదయ్య క్షేత్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న చెక్ డ్యాము పనులను మంత్రి పరిశీలించారు. సిద్ధిపేట వాగుపై ఇప్పటికే 27 చెక్ డ్యాములుండగా, దర్గ కొత్త చెక్ డ్యాము కలుపుకుని మొత్తం 28 చెక్ డ్యాములున్నాయని తెలిపారు. నంగునూరు మండలంలోని పెద్ద వాగు-మోయ తుమ్మెద వాగుపై ఇప్పటికే 7 చెక్ డ్యాములు ఉండగా.. ఖాతా గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న 2 చెక్ డ్యాములు కలుపుకుని మొత్తం 9 చెక్ డ్యాములు ఉన్నాయని వెల్లడించారు. ఈ చెక్​డ్యాంలతో నంగునూరు మండలంలోని వాగు పరివాహక ప్రాంతమంత జీవనదిగా మారనుందని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details