తెలంగాణ

telangana

'సోనియా చొరవతోనే తెలంగాణ సిద్ధించింది'

సోనియా గాంధీ ప్రత్యేక చొరవ వల్లే.. రాష్ట్ర ఏర్పాటు జరిగిందని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

By

Published : Jun 2, 2020, 7:50 PM IST

Published : Jun 2, 2020, 7:50 PM IST

Telangana Founding Day Celebrations at Husnabad Congress Party Office
'సోనియా గాంధీ ప్రత్యేక చొరవ వల్లే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు'

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి అన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు.

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2000 సంవత్సరం నుంచి 2014 వరకు తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమించరని లింగమూర్తి పేర్కొన్నారు.దాదాపు 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. సోనియా గాంధీ ప్రత్యేక చొరవ వల్లే.. రాష్ట్ర ఏర్పాటు జరిగిందని లింగమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఆరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కృషిని ఎవరు మరువకూడదని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details