కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి నిర్ణయాలకు మద్ధతు పలుకుతూ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తనవంతు సహాయంగా రూ. లక్ష రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
కరోనా నిధికి.. వంటేరు ప్రతాప్ రూ. లక్ష విరాళం - కరోనా నిధికి.. వంటేరు ప్రతాప్ రూ. లక్ష విరాళం
కరోనా నివారణ చర్యలకు ఉపయోగించేందుకు గానూ ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రూ. లక్ష అందజేశారు.
![కరోనా నిధికి.. వంటేరు ప్రతాప్ రూ. లక్ష విరాళం Telangana Forest Development Chairman Give One Lakh Rupees For CMRF](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6531275-1072-6531275-1585072511656.jpg)
కరోనా నిధికి.. వంటేరు ప్రతాప్ రూ. లక్ష విరాళం
కరోనా నిధికి.. వంటేరు ప్రతాప్ రూ. లక్ష విరాళం
కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. లాక్డౌన్, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్ దరిదాపుల్లో రాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను, లాక్డౌన్ ను ప్రతి వ్యక్తి పాటించాలన్నారు. స్వీయ నియంత్రణ చేసుకుంటూ ఇంటికే పరిమితం కావాలన్నారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 548 జిల్లాలు పూర్తిగా లాక్డౌన్