తెలంగాణ

telangana

ETV Bharat / state

మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోంది: హరీశ్‌రావు - harishrao on dubbaka election campaign

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, భాజపాపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి... రైతుల నుంచి కేంద్రం బిల్లులు వసూలు చేయమంటోందని విమర్శించారు. కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తా అన్నా కూడా బావి దగ్గర మీటర్లను కేసీఆర్​ పెట్టనివ్వలేదని తెలిపారు.

telangana financial minister harishrao on dubbaka election campaign
మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోంది: హరీశ్‌రావు

By

Published : Oct 31, 2020, 10:30 PM IST

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి... రైతుల నుంచి బిల్లులు వసూలు చేయమంటోందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మోతెలో నిర్వహించిన దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్, భాజపాపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మీటర్లు పెట్టడం మొదలైందన్న హరీశ్‌... తెలంగాణ ప్రభుత్వం మాత్రం తిరస్కరించిందని స్పష్టం చేశారు.

" ఆంధ్ర సీఎం శ్రీకాకుళంలో మీటర్లు పెట్టారు. ఏడాదిలోగా ఆ రాష్ట్రమంతా పెడతా అంటున్నరు. మన కేసీఆర్​ మాత్రం కేంద్రం ఇచ్చే రూ.2,500 కోట్లు అవసరం లేదన్నరు. మా రైతులు ఇప్పుడిప్పుడే ధైర్యంగా ఉన్నరు. నువ్వు డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా బావి దగ్గర మీటరు పెట్టనివ్వను అని కచ్చితంగా చెప్పిండు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తా అన్నడు మన కేసీఆర్​. తెలిసో, తెలియకో భాజపాకు నూరో, నూటయాభయ్యో ఓట్లు పడితే ఏమంటరు? బావి దగ్గర మీటర్లు పెడతం అంటే కూడా ఓట్లు వేశారు అని అనరా? మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్టు కాదా? ఈ విషయాలు ఆలోచించండి."

­-హరీశ్‌రావు, తెలంగాణ ఆర్థికమంత్రి

మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోంది: హరీశ్‌రావు

ఇదీ చూడండి:అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details