తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 4:51 PM IST

ETV Bharat / state

Harish Rao : కలెక్టర్ జీతం కంటే.. రైతుకు వచ్చే లాభాలెక్కువ

వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులతో అధిక దిగుబడి సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ సర్కార్, హార్టీకల్చర్ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటల సాగు మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోందని తెలిపారు.

harish rao, harish rao on malbari orchad
హరీశ్ రావు, మల్బరీ తోట, మల్బరీ సాగు

కలెక్టర్ జీతం కంటే పంట పండించే రైతుకు వచ్చే లాభం ఎక్కువని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కలెక్టర్​ పన్ను చెల్లించాల్సి వస్తుందని.. రైతుకు అలాంటి అవసరం ఉండదని తెలిపారు. ఈ భూమ్మీద రైతుకు బీమా ఇచ్చేది కేసీఆర్ సర్కార్ మాత్రమేనని వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలో మల్బరీ తోటల సాగు కోసం మొక్కలు నాటారు. అనంతరం జిల్లా ఉద్యాన-పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీ సాగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.

రైతులు వ్యక్తిగతంగా ఎదగాలన్నదే కేసీఆర్ సర్కార్ ధ్యేయం అని మంత్రి పేర్కొన్నారు. కర్షకులకు ఉత్పత్తి, ఆదాయం, ఆర్థిక పరిపుష్టి పెరగాలన్నదే లక్ష్యమని తెలిపారు. రైతులు కమర్షియల్ క్రాప్స్ పండించాలని సూచించారు. యువత పామాయిల్, సెరి కల్చర్ పంటలు వేసేలా ఆలోచన చేయాలని చెప్పారు.

వరి ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేనంతగా రాష్ట్రంలో పంటలు పండాయని మంత్రి హరీశ్ అన్నారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు అవలంభిస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించొచ్చని తెలిపారు. రాష్ట్రంలో మల్బరీ తోటల సాగు మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోందని చెప్పారు. హార్టీకల్చర్ అధికారుల సూచనలతో అధిక లాభాలు గడించొచ్చని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details