సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్, దుంపలపల్లి గ్రామాల్లో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు భాజపా పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటా ప్రచారం చేశారు. కార్యక్రమంలో భాజపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని రఘునందన్‌రావు అన్నారు.
బల్వంతపూర్, దుంపలపల్లిలో భాజపా ఇంటింటి ప్రచారం - భాజపా ఎన్నికల ప్రచారం వార్తలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్, దుంపలపల్లిలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆరోపించారు.
బల్వంతపూర్, దుంపలపల్లిలో భాజపా ఇంటింటి ప్రచారం
తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో తనకే తెలుసని.. తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి తలసానికి తెలీవని రఘునందన్‌రావు దుయ్యబట్టారు. దిల్లీ నిధులతోనే పింఛన్ వస్తోందని.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఏం ఇవ్వట్లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి:ఎట్లా పోవాలి.. శాశ్వత పరిష్కారానికి ఇంకెన్నేళ్లు..?