కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచికోడ్ శివారులోని స్వామి సమర్థ ఆశ్రమ నిర్వాహకుడు నరసింహాచారి అన్నారు. లాక్డౌన్ సమయంలో ఆశ్రమం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యాన్నదాన సదుపాయం కల్పించామని తెలిపారు.
కరోనా కాలంలో పేదలకు అండగా స్వామి సమర్థ ఆశ్రమం - swamy samartha ashramam in siddipet district
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచికోడ్ శివారులో.. స్వామి సమర్ధ ఆశ్రమం నెలకొల్పినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఆశ్రమ నిర్వాహకుడు నరసింహాచారి తెలిపారు. ఆశ్రమం ఆధ్వర్యంలో పేదకుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
దుబ్బాక మండలంలో స్వామి సమర్థ ఆశ్రమం
లాక్డౌన్ నిబంధనలు సడలించినా.. ఉపాధి లేక కష్టాలు ఎదుర్కొంటున్న నిరుపేదలకు.. ఆశ్రమం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఆశ్రమంం నెలకొల్పినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని నరసింహాచారి చెప్పారు. ఇటీవలే నిజామాబాద్లో సుమారు 100కు పైగా కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి చేయూతనందించామని వెల్లడించారు.