కరోనా రెండోదశ విజృంభణతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు కొవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రులకు పరుగెడుతున్నారు. ఆస్పత్రుల్లో పరీక్షలు తక్కువగా చేస్తుండటంతో ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షల కోసం రోజూ దాదాపు 100 మందికి పైగా ప్రజలు ఉదయాన్నే వస్తున్నారు. గంటల కొద్దీ లైన్లలో నిల్చున్నా.. కిట్ల కొరత కారణంగా సిబ్బంది 40 నుంచి 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా పరీక్షల కోసం పడిగాపులు కాస్తున్న అనుమానితులు..! - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల కొరత కారణంగా పరీక్షల సంఖ్యను తగ్గించడం అనుమానితుల పట్ల శాపంగా మారింది. రోజుల తరబడి లైన్లలో నిల్చున్నా.. తమవంతు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పరీక్షల కోసం రోజూ 100 మందికి పైగా ప్రజలు ఆస్పత్రికి వస్తుంటే.. సిబ్బంది మాత్రం 40 నుంచి 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరీక్షల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
![కరోనా పరీక్షల కోసం పడిగాపులు కాస్తున్న అనుమానితులు..! కరోనా పరీక్షల కోసం పడిగాపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:57:50:1620556070-tg-krn-102-09-carona-parikshala-kashtalu-av-ts10085-09052021154004-0905f-1620555004-1070.jpg)
కరోనా పరీక్షల కోసం పడిగాపులు
ఈ క్రమంలో రెండు, మూడు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నా.. తమ వంతు రావడం లేదని అనుమానితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న తమకు పాజిటివ్‌గా తేలితే త్వరగా మందులు వాడి కోలుకునే అవకాశం ఉంటుందని.. కానీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం వల్ల వైరస్ తీవ్రత పెరిగి ప్రాణాపాయ స్థితి నెలకొంటుందని వాపోతున్నారు. ఇప్పటికైనా కొవిడ్ పరీక్షలను పెంచాలని కోరుతున్నారు.