సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఫెర్టిలైజర్, సీడ్స్ దుకాణాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన గ్లైకోసెల్ హెచ్‌టీ బీటీ పత్తి విత్తనాలను, కూరగాయల విత్తనాలు, ఎరువులను అమ్మితే దుకాణదారులపై కఠిన చర్యలు తీసకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 మంది సభ్యులతో 15 బృందాలుగా విడిపోయి ఫెర్టిలైజర్ దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు - గజ్వేల్
ఖరీఫ్‌లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు