50 ఏళ్ల క్రితం ప్రైవేట్ పాఠశాలను స్థాపించి ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. గురుపూజ సందర్భంగా గురుదక్షణగా లక్షా 116 రూపాయలను అందించడం ఎంతో సంతోషకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్ఫూర్తి అసోసియేషన్ నిర్వహణలో తిరుమలయ్య కు గురుపూజోత్సవం, గురుదక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంతోమందికి విద్యాబుద్ధులను ప్రసాదించిన తిరుమలయ్య సన్మానానికి తనను ఆహ్వానించడం పట్ల సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల 60 ఏళ్ల పండగను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, స్ఫూర్తి నిర్వాహకులు పందిళ్ళ శంకర్, ఈనాడు సీనియర్ పాత్రికేయులు కొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
గురువుకు విద్యార్థుల ఘన సన్మానం - హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్ఫూర్తి అసోసియేషన్ నిర్వహణలో గురుపూజోత్సవం, గురుదక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ హాజరయ్యారు.
ఘన సన్మానం