వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ సర్కిల్లో వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన 42 దుకాణ సముదాయాలను మంత్రి ప్రారంభించారు. చిరు వ్యాపారులకు దుకాణ కేటాయింపు పత్రాలను అందజేశారు.
వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి : హరీశ్‌రావు - Siddipet street vendors complex news
సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన 42 దుకాణ సముదాయాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం వారికి దుకాణ కేటాయింపు పత్రాలను అందజేశారు.
రాష్ట్రంలో మొట్టమొదటిగా సిద్దిపేటలో వీధి వ్యాపారులకు దుకాణాలను కేటాయించినట్లు హరీశ్‌రావు అన్నారు. రూ. కోటి 30 లక్షలతో 40 దుకాణాలను నిర్మించామన్నారు. వీటిలో తాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వీధి వ్యాపారులు ఎండ, వానల వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇక నుంచి ఇక నుంచి దుకాణాల్లో వ్యాపారం నిర్వహించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రతి వీధి వ్యాపారితో మాట్లాడి వారి బాగోగులపై ఆరా తీశారు. అనంతరం ఓ దుకాణంలో టీ తాగుతూ వారితో సంభాషించారు.
ఇదీ చూడండి:'నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం'