సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో రహదారిపై కరోనా వైరస్ ఆకారంలో భారీ చిత్రాన్ని వేశారు. ఆగండి లాక్డౌన్ పాటించండి ఇళ్లలోనే ఉండండి అంటూ ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆగండి లాక్డౌన్ పాటించండి.. భారీ భయంకర చిత్రం - వడ్డేపల్లి గ్రామంలో రహదారిపై కరోనా చిత్రం
రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో కరోనా వైరస్ ఆకారంలో భారీ భయంకర చిత్రాన్ని రోడ్డుపై గీశారు. గ్రామ ప్రజలకు, వాహనదారులకు 'ఆగండి లాక్డౌన్ పాటించండి ఇళ్లలోనే ఉండండని' చెబుతున్నారు.
ఆగండి లాక్డౌన్ పాటించండి.. భారీ భయంకర చిత్రం
కొవిడ్-19 కట్టడి అయ్యే వరకు ప్రజలందరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రకారుడు రవితోపాటు, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ