తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు 'అమ్మ'లా చికిత్స చేస్తున్నారు: హరీశ్​ - తెలంగాణ తాజా వార్తలు

కరోనా బాధితులకు వైద్యులు, వైద్య సిబ్బంది 'అమ్మ'లా చికిత్స అందిస్తున్నారని ఆర్థిక మంత్రి హారీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో వంద పడకల కొవిడ్​ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

harishrao inaugurated 100 beds covid hospital
కరోనా బాధితులకు వైద్యులు 'అమ్మ'లా చికిత్స చేస్తున్నారు: హరీశ్​రావు

By

Published : Jul 15, 2020, 2:39 PM IST

కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోవడం వల్ల జిల్లాలో కొవిడ్​ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో వంద పడకల కొవిడ్​ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. వీటిలో 80 సాధారణ పడకలు, 20 ఐసీయూ పడకలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి కరోనా బారినపడొద్దని ఆయన సూచించారు.

వసతులపై ఆరా..

ఈ సందర్భంగా కొవిడ్ ఐసోలేషన్ వార్డులో మంత్రి కలియ తిరిగారు. కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. వైద్యం విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురమ్మని మంత్రి సూచించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇదీ చూడండీ: జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

ABOUT THE AUTHOR

...view details