తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారంరోజుల్లో సిద్దిపేట రైల్వేలైన్ పనులు ప్రారంభించాలి'

సిద్దిపేట కేసీఆర్​ నగర్ శివారులో రైల్వేస్టేషన్​ రాకతో... చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. దక్షిణ మధ్య రైల్వే సీఈ సధర్మ, అధికారులతో కలిసి స్టేషన్ నిర్మాణానికి స్థలం, డిజైన్లు పరిశీలించారు.

By

Published : Jan 28, 2021, 9:48 PM IST

state finance minister harish rao visit land for siddipeta railway station
'పనులు వేగంగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు రైలు అందుబాటులోకి తేవాలి'

వారం రోజుల్లో సిద్దిపేటలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వే ఇంజినీర్లను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే సీఈ సధర్మ, రైల్వే అధికారులతో కలిసి స్టేషన్ నిర్మాణానికి స్థలం, డిజైన్లను పరిశీలించారు. జిల్లాలో రైల్వే లైన్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు సమకూర్చినట్టు తెలిపారు. పనుల పురోగతిని బట్టి మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

'పనులు వేగంగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు రైలు అందుబాటులోకి తేవాలి'

రైల్వేశాఖ కూడా వేగంగా పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులో వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. భూ సేకరణ సమస్యలు ఏమైనా ఉంటే... రైల్వే అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ పబ్లిక్ రిలేషన్ అధికారి శైలేంద్ర కుమార్, రైల్వే అధికారులు సోమరాజు, ధర్మారావు, మున్సిపల్ కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బండారి నర్సింలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details