తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్ధిపేట జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాం' - ministre harishrao latest updates

అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా సిద్ధిపేటను నిలిపామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో జాతీయస్థాయిలో సిద్ధిపేటకు 10 పైచిలుకు అవార్డులు వచ్చాయని వివరించారు.

Necklace Road around Komati pond in Siddipet
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

By

Published : Apr 9, 2021, 4:03 AM IST

సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన నెక్లెస్ రోడ్డును మంత్రి హరీశ్ రావుప్రారంభించారు. ఈ కార్యక్రమంతో సిద్ధిపేట జిల్లాను అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా మార్చమన్నారు. 15 కోట్ల రూపాయలతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ , సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు.

రూ.2.50 కోట్లతో త్వరలోనే ఫుట్ బాల్ కోర్ట్​తో పాటు వాలీబాల్ అకాడమిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపు రూ.25 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బంగ్లాదేశ్​ ఎయిర్​ ఫోర్స్​, నేవీ చీఫ్​ల​తో నరవణే భేటీ

ABOUT THE AUTHOR

...view details