తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛ బడుల్లో ఏ లోటు రానీయెుద్దు: మంత్రి హరీశ్ రావు - హరిశ్​ రావు సిద్దిపేట పర్యటన

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ బడిని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

State Finance Minister Harish Rao
స్వచ్ఛ బడుల్లో ఏ లోటు రానీయెుద్దు: మంత్రి హరీశ్ రావు

By

Published : Jan 22, 2021, 5:55 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ బడిని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలోని 4వ వార్డులోని స్వచ్ఛ బడి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.

స్వచ్ఛ బడి నిర్మాణ పనులు ప్రారంభమై చాలా రోజులు అవుతుందని... పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను హరీశ్ రావు ఆదేశించారు. ఏరోబిక్ కంపోస్టు, వర్మీ కంపోస్టు షెడ్లను పరిశీలించారు. వీలైనంత త్వరగా స్వచ్ఛ బడి సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, కమిషనర్ రమణా చారి, కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఏఈ రంజిత్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బాబాలనే అనుమానంతో నలుగురికి దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details