కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్.. త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుతూ.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యాదరి క్షేత్రంలో మహా మృత్యుంజయ హోమం, నవ గ్రహ నక్షత్ర శాంతి ధన్వంతరి యజ్ఞాలను నిర్వహించారు.
'కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం’ - ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న సీఎం.. త్వరగా కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో హోమం నిర్వహించారు.
vanteru pratap reddy
స్వల్ప ఆరోగ్య సమస్యలున్న సీఎం.. త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోనికి రావాలని వేడుకుంటూ యాగాన్ని చేపట్టినన్నట్లు ప్రతాప్‌రెడ్డి వివరించారు. కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందంటూ కొనియడారు.