ఘనంగా శ్రీ సీతారామచంద్ర శావ - hanuman jayanthi
హనుమాన్ మాల ధరించిన స్వాములు శ్రీ రాముడు, హనుమాన్ విగ్రహాలతో మిడిదొడ్డి మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మంగళ హారతులిచ్చారు.
శ్రీ సీతారామచంద్ర శావ
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మాల ధరించిన స్వాములు శ్రీ సీతారామచంద్రస్వామి శావను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గ్రామ పురవీధుల గుండా భక్తి ప్రపత్తులతో, రామ నామ సంకీర్తనలతో ఊరేగించారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మేళతాళాలతో రామనామ స్మరణ చేశారు. వీధుల గుండా స్వామివారికి మంగళ హారతులిచ్చారు.