తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 5:52 PM IST

ETV Bharat / state

ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఆందోళన

ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎమ్మార్వో కార్యాలయం ముందు శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ ధర్నా నిర్వహించారు. తహసీల్దార్​కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

sriramulapally sarpanch protest against mptc as he occupied school land
ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని శ్రీరాములపల్లి సర్పంచ్ ఆందోళన

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో జడ్పీహెచ్​ఎస్​ పాఠశాల భూమిని ఎంపీటీసీ కబ్జా చేశారని సర్పంచ్ మంజుల ఆరోపించారు. ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించారు.

శ్రీరాములపల్లి గ్రామంలో 125 సర్వే నంబర్​లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి 2004లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేయగా.. గతేడాది ఆ భూమిని స్థానిక ఎంపీటీసీ కబ్జా చేశారని సర్పంచ్ మంజుల ఆరోపించారు. స్థానిక ఎమ్మార్వోకు ఎన్నో వినతులు సమర్పించినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి భూమిని కబ్జా చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పిల్లలకు ఉచిత విద్యనందించడానికి నిర్మించిన పాఠశాల భూమిని కబ్జా చేయడం దారుణమని పేర్కొన్నారు. భూమిని కబ్జా చేసిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆర్డీఓ, కలెక్టర్​ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details