తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు - karthika deepotsavam at gajwel

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు

By

Published : Nov 16, 2019, 9:03 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వాసవినగర్​లో శుక్రవారం రాత్రి శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. మేళతాళాల నడుమ మూడు గంటల పాటు కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మహిళలు దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details