తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్యరూపం దాల్చని ప్రజ్ఞాపూర్​ క్రీడా విలేజ్'​

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​లోని క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలంటే ప్రతినిత్యం సాధన ఎంతో అవసరం అది జరగాలంటే స్థానికంగా సకల సౌకర్యాలు ఉన్న మైదానాలు ఉండాలన్నారు. కానీ సరైన మైదానాలు లేక ఎంతో మంది క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని వాపోయారు.

sports ground issue in siddipet
'కార్యరూపం దాల్చని ప్రజ్ఞాపూర్​ క్రీడా విలేజ్'​

By

Published : Jan 15, 2020, 5:36 PM IST

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలికలో క్రీడాకారులు సాధన చేసేందుకు సదుపాయాలు లేక ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఒక్కోసారి పట్టణంలోని ప్రైవేటు స్థలాల్లో తాత్కాలిక ఏర్పాటు చేసుకుని ఆటలు ఆడుతున్నామన్నారు. 1995లో అప్పటి ప్రభుత్వం పట్టణ శివారులో రూ. లక్ష వ్యయంతో మైదానం నిర్మించిందని.. అది పట్టణానికి దూరంగా ఉండడం వల్ల వినియోగంలోకి రాలేదన్నారు.

2009 సంవత్సరంలో నాటి ప్రభుత్వం రెండు కోట్లు వెచ్చించి పాత క్రీడా మైదానం పక్కనే ఇండోర్ స్టేడియంను నిర్మించారు.. కానీ పూర్తిస్థాయిలో అక్కడ సౌకర్యాలు లేవన్నారు.దానిని ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయానికి కేటాయించారు. గతంలో మంత్రి హరీష్ రావు క్రీడా విలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు.

'కార్యరూపం దాల్చని ప్రజ్ఞాపూర్​ క్రీడా విలేజ్'​

ఇదీ చూడండి : కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

ABOUT THE AUTHOR

...view details