సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అయోధ్యలో రామమందిరం భూమిపూజను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు రాజగోపాలచారి పంచామృత అభిషేకాలు, అలంకరణ, అర్చన, వంటి పూజా కార్యక్రమాలు చేశారు. రామనామ కీర్తనలను, మంత్రాలను పఠనం చేశారు. ఆలయంలో అఖండ భజన నిర్వహించారు.
అయోధ్యలో భూమిపూజ... సిద్దిపేటలో విశేష పూజలు - మిరుదొడ్డిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, అఖండ భజన కార్యక్రమాలు చేపట్టారు.

అయోధ్యలో భూమిపూజ సందర్భంగా సిద్దిపేట రామాలయంలో విశేష పూజలు
పరిమిత సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి భక్తి గీతాలను ఆలపించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రామ మందిరం నిర్మాణానికి నిదర్శనంగా గ్రామంలోని ప్రతి భక్తుడి ఇంటిపైన ఓంకారం జెండా ఎగిరే విధంగా కాషాయ జెండాలను గ్రామస్థులకు, భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేశం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగన బోయిన రాములు, గ్రామ పెద్దలు, భాజపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!