ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోగ్యం బాగుండాలని, కరోనాను జయించాలని సిద్దిపేట నియోజక వర్గం వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు తెరాస నాయకులు రాము, శ్రీనివాస్, తిరుపతిల ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు బాగుండాలని కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పాదయాత్ర చేపట్టారు.
కరోనా నుంచి మంత్రి హరీశ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు - మంత్రి హరీశ్ కోసం ప్రత్యేక పూజలు
మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కరోనాను జయించాలని సిద్దిపేట నియోజక వర్గం వ్యాప్తంగా ఆయన అభిమానులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరోనా నుంచి మంత్రి హరీశ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వరకు ఖాళీ నడకన వెళ్లారు. అంతకు ముందు సిద్దిపేట, నంగునూర్, సిద్దన్నపేట దేవాలయలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తమ ప్రియతమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.