సిద్దిపేటలో తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనుమతి కోసం సోనూ ప్రతినిధులు.. మంత్రి హరీశ్‌రావును కలిశారు.
Sonu Sood: సిద్దిపేటలో త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ - సిద్దిపేట వార్తలు
కరోనా కాలంలో ప్రజలకు దేవుడిలా సాయం చేస్తున్న సోనూసూద్... సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తన మిత్రుని సూచన మేరకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుమతి కోసం సోనూ ప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిశారు.
Sonu Sood: సిద్దిపేటలో త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్
సోనూసూద్ ప్రతిపాదనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత యాదగిరి, రంజిత్, స్వామి, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:18 ఏళ్లు దాటితే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే!