తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి ఆమరణ నిరాహార దీక్ష... చెట్టెక్కి కొడుకు ఆందోళన - తెలంగాణ వార్తలు

తండ్రీ కుమారుల పంచాయితీ రోడ్డెక్కింది. తండ్రి కొడుకు సరిగా చూడట్లేదంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా... కొడుకు తండ్రి అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెట్టెక్కి హల్​చల్​ చేశాడు.

son and father quarrel
తండ్రి ఆమరణ నిరాహార దీక్ష... చెట్టెక్కి కొడుకు ఆందోళన

By

Published : Jun 14, 2021, 8:36 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తండ్రీ కుమారుల పంచాయితీ రోడ్డుకెక్కింది. కుమారుడు తన బాగోగులు చూడటం లేదంటూ స్వామి అనే వృద్ధుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా... అనవసరంగా తన తండ్రి ఆరోపణలు చేస్తున్నాడని కుమారుడు సంతోష్‌ చెట్టు ఎక్కి హల్‌చల్‌ చేశాడు. చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తికి సర్ది చెప్పి కిందికి దించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించి... తండ్రీ కుమారులకు రాజీ కుదిర్చారు. ఎస్సై శ్రీధర్​ సమక్షంలో తండ్రీ కుమారుల మధ్య రాజీ కుదరడంతో సమస్య సద్దుమణిగింది.

తండ్రి ఆమరణ నిరాహార దీక్ష... చెట్టెక్కి కొడుకు ఆందోళన

ఇదీ చదవండి: కుమారులు చూసుకోవడం లేదని వృద్ధుడు దీక్ష

ABOUT THE AUTHOR

...view details