సిద్దిపేట పట్టణం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో గత రాత్రి ఆటో-ద్విచక్రవాహనం ఢీకొని ఓ ఆటోడ్రైవర్ చనిపోయాడు. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిద్దిపేట ఏరియా ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు ధర్నా నిర్వహించారు.
'108 సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆ వ్యక్తి మృతి చెందాడు' - సిద్దిపేట ఆసుపత్రి ఎదుట ఆందోళన
108 సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వ్యక్తి చనిపోయాడంటూ బంధువులు సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'108 సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆ వ్యక్తి మృతి చెందాడు'
ప్రమాదం జరిగినప్పుడు 108 వాహన సిబ్బంది క్షతగాత్రులను సరిగ్గా పట్టించుకోలేదని, ముందుగా ద్విచక్రవాహనదారులనే ఆసుపత్రికి తరలించారని అందువల్లే తిరుపతి చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సైదులు ఘటన స్థలానికి చేరుకొని తిరుపతి కుటుంబ సభ్యులను సముదాయించి ధర్నా విరమింపజేశారు.
ఇదీ చదవండి:గుర్రం స్వారీ చేస్తుండగా.. సీఎం మనవడు హిమాన్షుకు గాయాలు