సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివదేహం ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామానికి చేరుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరిన ఎమ్మెల్యే సోలిపేట అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఉదయం ఆరు గంటలకు ఎమ్మెల్యే పార్థివదేహం స్వగ్రామానికి తరలించారు.
స్వస్థలానికి సోలిపేట పార్థివదేహం..పెద్ద సంఖ్యలో అభిమానులు - ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామానికి చేరుకుంది
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివదేహం ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామానికి చేరుకుంది. పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో గుంపులుగా చేరారు.
స్వస్థలానికి సోలిపేట పార్థివదేహం..పెద్ద సంఖ్యలో అభిమానులు
దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఎమ్మెల్యే పార్థివదేహన్ని చూడడానికి తరలివస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ వచ్చిన వారు కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో గుమిగుడారు.
ఇదీ చూడండి :తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Last Updated : Aug 6, 2020, 11:09 AM IST