సిద్దిపేట జిల్లా తొగుటలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన బక్కోళ్ల మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని యువజన నాయకుడు సోలిపేట సతీశ్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడం ఏ తండ్రికైనా బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సోలిపేట సతీశ్‌రెడ్డి - toguta news
సిద్దిపేట జిల్లా తోగుటలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని యువజననాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
![మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సోలిపేట సతీశ్‌రెడ్డి solipeta sathish visitation madhusudhanreddy family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8666968-894-8666968-1599140713132.jpg)
solipeta sathish visitation madhusudhanreddy family
ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మాల్లారెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ గడిల అనిత లక్ష్మారెడ్డి, వైస్ ఛైర్మన్ దేవునూరి పోచయ్య, కో ఆపరేటివ్ ఛైర్మన్ హరిక్రిష్ణరెడ్డి, వైస్ ఛైర్మన్ యాదగిరి, రైతు బంధు అధ్యక్షుడు కనకయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.