సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన గంధపు శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నాడు. లాక్డౌన్ కారణంగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటి నుంచి పని చేసుకోవడానికి అవకాశమిచ్చాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ కుటుంబ కార్డుపై కేశవాపూర్‌లో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నాడు. శరీరం, మనసు ఉత్సాహంగా ఉండటానికి ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నానని ఆయన తెలిపాడు.
ఉపాధి హామీ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ - ఉపాధిహామీ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్
లాక్డౌన్ వల్ల ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. శరీరం, మనసు ఉల్లాసంగా ఉండడానికే తాను ఈ పనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పాడు.
![ఉపాధి హామీ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉపాధిహామీ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6999905-220-6999905-1588232912024.jpg)
ఉపాధిహామీ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్
TAGGED:
UPADHI HAMI PANULLO SOFTWARE