మొక్కలు నాటే విధానంలోనే మొక్క ఎదుగుదల ఉంటుందని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి అన్నారు. రానున్న నెలరోజుల్లో నెమ్మదిగా హరితహారం కార్యక్రమాన్ని సాగిస్తామన్నారు. పద్ధతిగా ప్రగతిని సాధించి జిల్లాను ఆదర్శంగా మారుస్తామని తెలిపారు.
జిల్లాలోని గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో గురువారం ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా భాగస్వామ్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మండలాన్ని 4 భాగాలుగా ఏంపీడీవో, ఏంపీవో, ఏపీవో, మండల ప్రత్యేక అధికారులకు విభజించి వారి స్వీయ పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. రెండేళ్ల కింద చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి, దేశంలోనే జిల్లాను ఆదర్శంగా నిలిపినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం