వస్త్రోత్పత్తి పరిశ్రమలో అరవై శాతానికిపైగా పురాతన మరమగ్గాలున్నాయి. వీటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రుజువు చేస్తున్నారు కొందరు సిరిసిల్ల యువ వస్త్రోత్పత్తిదారులు. ఏడాదిలో గరిష్ఠంగా ఏడు నెలలు ప్రభుత్వ ఆర్డర్లు ఉంటున్నాయి. తర్వాత ఉపాధి సగానికి పడిపోతోంది. ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడకుండా బహిరంగ విపణిలో డిమాండ్ ఉన్న చీరల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో 26 వేల మరమగ్గాలను చేనేత, జౌళిశాఖ జియోట్యాగింగ్ చేసింది. వాటిలో 11 వేల మరమగ్గాలకు ప్రభుత్వం కల్పించిన రాయితీతో ఆటోమేటిక్ మోషన్.. డాబీ పరికరాలను అమర్చుకున్నారు. కొందరు యువకులు మరో అడుగు ముందుకేసి సొంత ఖర్చులతో మాన్యువల్, ఎలక్ట్రానిక్ జకాట్‌లను అమర్చుకున్నారు.
నవ్యతకు నాంది
సాధారణ మరమగ్గానికే హుక్స్ (640-940)కు పెంచుకుంటున్నారు. దీంతో చీరలపై ఫొటోలతో ఉత్పత్తి చేయవచ్ఛు జకాట్ పరికరం ఏర్పాటుకు రూ.2.75 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. తమకున్న మరమగ్గాల్లో ఒకటి, రెండింటికి ఈ పరికరాన్ని అమర్చుకుంటున్నారు. ఖర్చుతో కూడుకున్నదే అయినా.. ఆర్డర్లతో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని జిల్లాలో ఇప్పుడిప్పుడే పదుల సంఖ్యలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. బతకమ్మ చీరల ఉత్పత్తితో వార్ఫ్. వెప్ట్‌లో పాలిస్టర్, జరీ అంచులు... వివిధ రకాల డిజైన్లను తయారు చేశారు. ఈ పరికరంతో సిల్క్, పట్టు, పాలిస్టర్, కాటన్‌లను ఉత్పత్తి చేయవచ్ఛు చీరల ఉత్పత్తితో డిజైన్‌ను బట్టి విపణిలో మంచి ధర లభిస్తుంది.
వస్త్రోత్పత్తి పరిశ్రమ స్వరూపం
జియోట్యాగింగ్ చేసిన మరమగ్గాలు : 26,494
ఆధునికీకరించినవి : 15,402
పురాతనమైనవి : 11,092
టెక్స్‌టైల్ పార్కులోనివి: 1,500
పని తీరు ఇలా...
బతుకమ్మ చీరల ఉత్పత్తితో పరిశ్రమ మొత్తం ముతక రకం నుంచి మేలు రకాల రంగుల చీరల ఉత్పత్తి ప్రారంభమైంది. బతుకమ్మ చీరలు, తమిళనాడు సంక్రాంతి చీరలు, పాఠశాల దుస్తుల్లోనూ డిజైన్లు మారాయి. ఎలక్ట్రానిక్ జకాట్‌లో కంప్యూటర్‌లో ఒకేసారి వెయ్యి డిజైన్లను ఎంపిక చేసుకుని మెమోరీ కార్డును పరికరానికి అమర్చుతారు. దీనిలో వాడే నూలు తేలికపాటి పట్టును పోలి ఉంటుంది. విఫణిలో పట్టుచీరల డిజైన్లను పోలి ఉంటుంది. నూలును వార్పిన్ నుంచి నేరుగా యంత్రానికి అనుసంధానం చేయవచ్ఛు నాలుగు మగ్గాలకు ఒక కార్మికుడు సరిపోతాడు. కార్మికులపై పని భారంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తికి కార్మికునికి మీటరుకు రూ.8.50 చెల్లించగా.. జకాట్‌పై ఉత్పత్తి చేసే చీరలకు రూ.30 చెల్లిస్తారు.