జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్రవాహనాల చోరీ - సిద్దిపేట జిల్లాలో బైక్ దొంగతనాల వార్తలు
జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులకు వారు చిక్కారు.
![జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్రవాహనాల చోరీ Siddipeta Police arrested three men for Bike robberies at Gajwel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7660864-604-7660864-1592413515898.jpg)
జల్సాలకు అలవాటుపడి.. బైక్‌ల చోరీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన మహేష్ గౌడ్, ముప్పుకల్ చెందిన నసీరుద్దీన్, కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఊరే రాజులు ఇటీవలే దొంగతనాలు చేస్తున్నట్టు అంగీకరించారు. నిందితుల నుంచి పది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని, రిమాండ్ విధించారు.