తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సాంప్రదాయం' - తెలంగాణ తాజా వార్తలు

శుభ కార్యక్రమం జరిగినప్పుడు పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సాంప్రదాయమని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామి రెడ్డి అన్నారు. తను సీఎం కాళ్లు మొక్కడం సామాజిక మాధ్యమాల్లో రావటంపై కలెక్టర్​ వివరణ ఇచ్చారు.

cm kcr, collector venktrami reddy
సీఎం కేసీఆర్​, కలెక్టర్​ వెంకట్రామి రెడ్డి

By

Published : Jun 21, 2021, 5:19 AM IST

Updated : Jun 21, 2021, 6:05 AM IST

'పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సాంప్రదాయం'

ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటన సందర్భంగా ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం తర్వాత జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు. వారు కూడా కేసీఆర్ కాళ్లు మొక్కారు. సీఎం కాళ్లు మొక్కడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. దీనిపై కలెక్టర్​ వెంకట్రామి రెడ్డి స్పందించారు.

శుభ కార్యక్రమం జరిగినప్పుడు పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సాంప్రదాయమన్నారు. నూతన కలెక్టరేట్​లో బాధ్యతలు అప్పగించి ఆశీర్వదిస్తున్న క్రమంలో తండ్రి సమానుడైన సీఎం ఆశీస్సులు తీసుకున్ననాని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని.. నేను తండ్రిలా భావించే సీఎం నుంచి ఫాదర్స్ డే సందర్భంగా ఆశీర్వాదం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Cm Kcr: కామారెడ్డికి మెడికల్ కాలేజీ... నాదీ పూచీ

Last Updated : Jun 21, 2021, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details