సిద్దిపేట పట్టణంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సురభి రాంగోపాల్ రావు, అంజన్ రావు ఇళ్లలో సోదాలు చేశామన్నారు. అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెచ్చిన ఆ డబ్బును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ - సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ వార్తలు
సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించినట్లు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ క్రమంలోనే అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు దొరికినట్లు పేర్కొన్నారు. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఆ డబ్బు తెచ్చినట్లు చెప్పారు. నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. పోలీసుల నుంచి రూ. 5.07 లక్షలు భాజపా శ్రేణులు తీసుకెళ్లాయని జోయల్ డేవిస్ వెల్లడించారు
![అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9322344-thumbnail-3x2-cp.jpg)
అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ
అయితే ఈ క్రమంలో అంజన్ రావు ఇంటివైపు రఘునందన్ రావు, భాజపా శ్రేణులు ఒక్కసారిగా వచ్చాయని సీపీ తెలిపారు. పోలీసుల నుంచి రూ. 5.07 లక్షలు తీసుకెళ్లారని జోయల్ డేవిస్ వెల్లడించారు. డబ్బులు తీసుకెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ
ఇదీ చదవండి:సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం