ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివదేహాన్ని ప్రముఖ నేతలు, అధికారులు సందర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, జేసీ పద్మాకర్,ఆర్టీవో అనంతరెడ్డి ఎమ్మెల్యే పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుమారుడు సోలిపేట సతీశ్ రెడ్డితోపాటు కుటుంబసభ్యులను పరామర్శించారు.
రామలింగారెడ్డి భౌతికకాయానికి కలెక్టర్ నివాళులు - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సందర్శించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీశ్ రెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామలింగారెడ్డి భౌతికకాయానికి కలెక్టర్ నివాళులు
దుబ్బాక ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రామలింగా రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కాలిపై కురుపు రావడం వల్ల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఇన్ ఫెక్షన్ పెరగడం వల్ల ఆసుపత్రిలోనే చికిత్స పోందారు. పరిస్థితి విషమించి.. ఆయన అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.