దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ వాహనంలో రూ.7.50 లక్షల రూపాయలున్న సంచిని గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్పును కలెక్టర్ ఆఫీసులో డిపాజిట్ చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. సంబంధిత వ్యక్తి ఆధారాలు చూపించి డబ్బు తీసుకెళ్లవచ్చవని చెప్పారు.
సిద్దిపేటలో రూ.7.50 లక్షలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు - police vehicle raids in siddipet
ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.7 లక్షల 50వేలను సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా నగదు దొరికినట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
![సిద్దిపేటలో రూ.7.50 లక్షలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు siddipet traffic police vehicle raids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9155683-26-9155683-1602563223813.jpg)
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు
ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద రూ.50వేలకు మించి డబ్బు ఉండవద్దని, ఒకవేళ ఉంటే పక్కా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. వ్యాపారులు.. వ్యాపార లావాదేవీలు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని సూచించారు.