తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం.. బతుకమ్మ పండుగ' - Siddipet Police celebrated Batukamma

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ.. ఈ రాష్ట్ర చారిత్రక చిహ్నమని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఓపెన్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలను సతీమణితో కలిసి జోయల్ డేవిస్ ప్రారంభించారు.

Batukamma festival at komati cheruvu
సిద్దిపేటలో బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 23, 2020, 7:24 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తన సతీమణి రాజ్ ప్రతీపతో కలిసి వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ సంబురాల్లో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీసులు, వారి కుటుంబాలు పాల్గొన్నాయి.

పోలీసులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడటం చాలా ఆనందంగా ఉందని సీపీ జోయల్ డేవిస్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ చారిత్రక చిహ్నమని పేర్కొన్నారు. బతుకమ్మ పాటల్లో మహిళలు వారి కష్టసుఖాలను, స్నేహాన్ని, ప్రేమను, భక్తి, భయం, చరిత్ర, పురాణాలను మేళవించి ఆలపిస్తారని తెలిపారు.

సిద్దిపేటలో బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details