సిద్దిపేట పురపాలక ఎన్నికలు చివరిసారిగా 2016లో జరిగాయి. అప్పుడు 34 వార్డులు ఉండగా.. 6 వార్డులను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకుంది. 28 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోనూ ప్రధాన పార్టీలు పోటీ చేయలేకపోయాయి. కాంగ్రెస్-15, భాజపా-1 4, తెదేపా- 11, ఎంఐఎం- 5, సీపీఎం- 2 వార్డుల్లో పోటీ చేశాయి. చాలా వార్డుల్లో అధికార తెరాసకు పోటీగా.. అదే పార్టీకి చెందిన రెబల్స్ బరిలోకి దిగారు. ఎన్నికలు జరిగిన 28 వార్డుల్లో తెరాస-16, భాజపా, కాంగ్రెస్ చెరో 2, ఎంఐఎం ఒక స్థానంలో గెలవగా.. తెరాస రెబల్స్ 7 వార్డుల్లో విజయం సాధించారు. ఫలితాల తర్వాత ఒక్కరు తప్ప మిగిలిన కౌన్సిలర్లు అందరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
రసవత్తరంగా సిద్దిపేట పురపాలక ఎన్నికలు - municipal election updates
సిద్దిపేట పురపోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల కంటే పరిస్థితులు ఈసారి భిన్నంగా మారాయి. ఉద్యమ పురిటి గడ్డపై ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. గత ఎన్నికల్లో అభ్యర్థులు లేక ఏకగ్రీవాలైన పరిస్థితి నుంచి.. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే స్థాయికి ఎదిగాయి.
siddipet-municipal-election-campaigning
ప్రస్తుతం పట్టణాన్ని 43వార్డులుగా విభజించారు. ఈసారి అన్నివార్డుల్లో పోటీ నెలకొంది. భాజపా 40, కాంగ్రెస్ 30, ఎంఐఎం 4, సీపీఎం, సీపీఐ ఒక్కో వార్డులో పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్, భాజపా.... ఈసారి రెట్టింపు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. అభ్యర్థులు ఎవరికి వారు తమదే గెలుపు అన్న ధీమాతో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రజల తీర్పు మాత్రం మే మూడో తేదీన తెలియనుంది.