తెలంగాణ

telangana

ETV Bharat / state

అంధ ఉద్యోగి పెద్ద మనసు... నెలజీతం విరాళం

కంటి చూపు లేకపోయినా పెద్ద మనసు ఉందని నిరూపించుకుంది సిద్దిపేటకు చెందిన ఓ అంధురాలు. పారిశుద్ధ్య కార్మికుల కోసం తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు చెక్కును మంత్రి హరీశ్‌రావుకు అందజేసింది.

Donation
Donation

By

Published : Mar 30, 2020, 9:26 PM IST

సిద్దిపేట మున్సిపాలిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అంధ ఉద్యోగి భాగ్య తన నెలజీతాన్ని పారిశుద్ధ్య కార్మికుల కోసం విరాళమిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు రూ. 25 వేల చెక్కును అందించింది. భార్యాభర్తలిద్దరు అంధులే అయినా వారి మనస్సు మాత్రం చాలా పెద్దదని మంత్రి అన్నారు.

ప్రస్తుత పరిస్థితులల్లో రోజూ కష్టపడి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆమె చేసిన సహాయాన్ని హరీశ్‌రావు అభినందించారు. వీరి స్ఫూర్తితో చేయి చేయి కలిపి... కరోనా ప్రభావాన్ని అంతమొందిద్దామని ఆయన అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఆపన్నహస్తం అందించేందుకు మరింతమంది ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మంత్రి హరీశ్‌రావుకు చెక్కు అందిస్తున్న భాగ్య

ఇదీ చూడండి:-'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'

ABOUT THE AUTHOR

...view details