సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రధాన ఆలయంలోని లక్ష్మీ దేవి అమ్మవారి నరసింహ స్వామి వారి ఉత్సవ మూర్తులను నయనానందకరంగా అలంకరించారు. స్వామి వారి కల్యాణ కథను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభగంగా నాచగిరి లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి తిరుగు కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వం తరఫున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
nachagiri, laxminarasimha swamy
ప్రభుత్వం తరఫున స్వామివారికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ, ఆలయ ఛైర్మన్ హనుమంతరావుతో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సాగర్ పోరు: ప్రచారంలో డీజే పాటలకు సెప్పులేసిన భాజపా అభ్యర్థి