సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజలు జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. హుస్నాబాద్ ప్రయాణ ప్రాంగణంలో, పలు వీధులలో సోలార్ ఫిల్టర్లతో గ్రహణాన్ని పట్టణ ప్రముఖులు, ప్రజలు తిలకించారు. ఏసీపీ మహేందర్, మున్సిపల్ ఛైర్పర్సన్ రజితలు ప్రజలతో కలిసి సూర్య గ్రహణాన్ని చూశారు. ప్రజలు మూఢనమ్మకాలు వీడి, శాస్త్రీయ దృక్పథాన్ని పంచుకోవాలని ఏసీపీ సందేపోగు మహేందర్ తెలిపారు.
జేవీవీ ఆధ్వర్యంలో గ్రహణాన్ని వీక్షించిన హుస్నాబాద్ వాసులు - Solar Eclipse Janavignana vedika
ఆదివారం ఆకాశంలో కనువిందు చేసిన సూర్యగ్రహణాన్ని జేవీవీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులు వీక్షించారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం, పలు వీధుల్లో ప్రజలతో కలిసి ఏసీపీ మహేందర్, మున్సిపల్ ఛైర్పర్సన్ రజిత గ్రహణాన్ని చూశారు.
గ్రహణ వీక్షణ
గ్రహణం రోజు చెడు జరుగుతుందనే అపోహలు వీడి, సోలార్ ఫిల్టర్లతో ఆకాశంలో కనువిందు చేసే గ్రహణాన్ని చూడాలని కోరారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని... ఇది విశ్వంలో జరిగే ఒక ప్రక్రియ మాత్రమేనని జేవీవీ ఉపాధ్యక్షులు చింతకింది శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు.