కరోనాతో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్ త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే సతీష్‌కుమార్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రజాప్రతినిధుల పూజలు - ఎమ్మెల్యే సతీష్ కుమార్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
కరోనా బారిన పడిన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ కుమార్... త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే సతీష్‌కుమార్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రజాప్రతినిధుల పూజలు
వ్యాధి బారిన పడిన వారందరు కోలుకోవాలని ప్రార్థిస్తూ జడ్పీ వైస్ ఛైర్మన్ రాజా రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ రజిత ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.