సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ధర్మాజీపేట గ్రామంలోని 6, 9 వార్డులలో పోలింగ్ సరళి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.