సార్వత్రిక ఎన్నికలకు సిద్దిపేటలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా పరిపాలనాధికారి కృష్ణభాస్కర్ తెలిపారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని.. మరికొన్ని గంటల్లో ఈవీఎంలు కేంద్రాలకు చేరుకుంటాయని సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ నిర్వాహణ కోసం సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా ఓట్ల పండగను నిర్వహించడానికి చర్యలు చేపట్టామంటున్న సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సార్వత్రిక ఎన్నికల కోసం సర్వం సన్నద్ధం - interview
సిద్దిపేటలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిద్దిపేట జిల్లా పాలనాధికారి కృష్ణభాస్కర్ తెలిపారు. వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, సాంకేతిక సమస్యలు వస్తే అధిగమించడానికి.. అవసరానికి మించి అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి