ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో హరిత హారం కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన వెంకట్రామ రెడ్డి.. జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికి కావాల్సిన మొక్కల వివరాలను నమోదు చేయాలని సూచించారు.
పకడ్బందీ ప్రణాళికతో జిల్లాలో హరితహారం కార్యక్రమం - haritha haram in siddipet
మరింత పకడ్బందీగా హరిత హారం కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ మొజాంమిల్ ఖాన్, జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి
ఇంటి యజమాని సంతకంతో కూడిన నివేదికను రూపొందించాలని, ప్రతి ఇంట్లో కనీసం 6 మొక్కలకు తగ్గకుండా.. ఎన్ని మొక్కలు కావాలో సమాచారం సేకరించాలని తెలిపారు. ఈ వివరాలను అక్టోబర్ 5న తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న 2-3 సంవత్సరాలకు పకడ్బందీ ప్రణాళికతో మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.