తెలంగాణ

telangana

ETV Bharat / state

'డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయండి' - Siddipet collector on double bed room hoses

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీలో కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.

'డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయండి'
'డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయండి'

By

Published : Oct 6, 2020, 9:30 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తుది దశకు చేరుకున్న రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తైన ఇళ్లతో పాటు, నిర్మాణాల పరంగా తుది దశకు చేరుకున్న రెండు పడక గదుల ఇళ్లను సాధ్యమైనంత త్వరగా ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.

గజ్వేల్ ఐఓసీలో ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డితో కలిసి కలెక్టర్.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ఇంజినీరింగ్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాన్స్ కో పర్యవేక్షణ ఇంజినీర్ కరుణాకర్, మిషన్ భగీరథ పర్యవేక్షణ ఇంజినీర్ రాజయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​గా మార్చేశారు'

ABOUT THE AUTHOR

...view details